![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -488 లో... మీరా గురించి ఎంక్వైరీ చేసి ఇంటికి వచ్చిన భవాని అందరితో మాట్లాడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మురారి తప్పు చేయడు. కృష్ణ అబద్ధం చెప్పదని నాకు నమ్మకం ఉంది. మరి అలాంటప్పుడు ముకుంద తప్పు చేసిందని అనుకోవచ్చు అంటారు. కానీ ముకుంద వైపు అన్నీ నిజాలే కనిపిస్తున్నాయి. ఓవైపు నమ్మకం మరోవైపు నిజం రెండింటి మధ్య సంఘర్షణలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాను. ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు కానీ మీరా కడుపులో పెరుగుతున్నది మాత్రం ఈ ఇంటి వారసుడు అనేది మాత్రం నిజం. అందుకే కృష్ణ చెప్పేది నిజం అని తెలిసినా ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. అసలు మీరా ఏది పిలవండి అని భవాని అనగానే.. తను ఎక్కడికో వెళ్లింది. ఇంట్లో లేదని ఆదర్శ్ అంటాడు.
కృష్ణ శ్రీనివాస్ ఇంటికి వస్తుంది. దండ వేసున్న ముకుంద ఫొటోని కింద విసిరి పగలగొడుతుంది. ఎందుకు ఇలా చేశావ్ చనిపోయినా ఇంకా నీకు నా కూతురు మీద పగ చల్లారలేదా కృష్ణ అని శ్రీనివాస్ అంటాడు. మీ కూతురు చనిపోయిందా అని కృష్ణ రెట్టించి అడుగుతుంది. శ్రీనివాస్ షాక్ అయిపోతాడు. చనిపోయిందని మీ కూతురు మీద ఒట్టు వేసి చెప్పమని అడుగుతుంది. నువ్వు నీ కూతురితో కలిసి నాటకం ఆడుతున్నావ్. నువ్వు కూడా నా జీవితంతో ఆడుకుంటున్నావ్ కదా బాబాయ్ అని కృష్ణ అనగానే.. అలా అనకు కృష్ణ నా కూతురితో పాటే నిన్ను చూశానని శ్రీనివాస్ అంటాడు. మరి నిజం చెప్పమని కృష్ణ అనగానే.. నేను చెప్పలేనని శ్రీనివాస్ అంటాడు. మరోవైపు మురారి ముకుంద మాటలు తలచుకొని బాధపడతాడు. కృష్ణ ఇంట్లో ఎన్ని పాట్లు పడుతుందో అందరినీ ఎలా ఎదుర్కొంటుందో అని బాధ పడతాడు.
కాసేపటికి మురారి దగ్గరకు ముకుంద వస్తుంది. కృష్ణని మర్చిపోమని చెప్తుంది. యాక్సిడెంట్ కంటే నువ్వే నన్ను ఎక్కువ బాధిస్తున్నావని మురారి అంటాడు. ఇక ఎమోషనల్ అవుతూ కృష్ణని చూపించమని మురారి అడుగుతాడు. దానికి ముకుంద ఆఖరి చూపు అని మర్చిపోతావా అని అంటుంది. ముకుంద చూపించనని అంటుంది. ముకుంద అంతా పకడ్భందీగా ప్లాన్ చేశానని నిన్ను వదలనని అంటుంది. మురారి మనసు మారేవరకు బెడ్ మీద ఉండాల్సిందేనని తను అలాగే ప్లాన్ చేశానని ముకుంద అంటుంది. ఇంట్లో అందరు నన్ను తల్లిని చేసి ఎక్కడికో పారిపోయారని అనుకుంటున్నారని చెప్తుంది. అందరిని మర్చిపోవాలి.. నువ్వు, నేను మన బిడ్డ ఇదే మన ప్రపంచం కావాలని ముకుంద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |